Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
Fauzi | ప్రభాస్ కోస్టార్ ఇమాన్వీ మంగళవారం 31వ పుట్టినరోజు జరుపుకుంది. తన కోస్టార్లకు షడ్రుచులతో కూడిన భోజనం పెట్టి మరిచిపోలేని ఆతిథ్యాన్నిచ్చే యాక్టర్లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాతే మరెవరైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Fauzi | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘ఫౌజీ`(Fauzi) . హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇమాన్వీ (Imanvi) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫౌజీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
తన కోస్టార్లకు షడ్రుచులతో కూడిన భోజనం పెట్టి మరిచిపోలేని ఆతిథ్యాన్నిచ్చే యాక్టర్లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాతే మరెవరైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలతో సెట్స్‌లో ఉన్నవారిని సర్ప్రైజ్ చేయడంలో ముందుంటాడు. ప్రభాస్ కోస్టార్ ఇమాన్వీ మంగళవారం 31వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఇమాన్వీకి పలు సర్ప్రైజలు వచ్చాయి. అందులో ప్రత్యేకమైంది ప్రభాస్ పంపిన గిఫ్ట్.. ఇంతకీ అదేంటో ఊహించే ఉంటారు. ఇమాన్వీకి ప్రభాస్ రకరకాల వెరైటీ వంటకాలతో కూడిన భోజనాన్ని పంపించాడు. ప్రభాస్ పంపిని ప్రత్యేకమైన భోజనాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఇమాన్వీ. నా హృదయం, కడుపు ఎప్పటికీ నిండుగా ఉంటాయంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇమాన్వీ.
హైదరాబాదీ ఫీస్ట్, బిర్యానీ, పులావ్, డిఫరెంట్ స్టార్టర్స్‌తో ఇమాన్వీ టేబుల్‌ను నింపేశాడు ప్రభాస్. చికెన్ 65, చిల్లీ చికెన్, సీఖ్, షమీ కెబాబ్స్, తంతూరి చికెన్, కర్రీస్, గ్రేవీస్, సాలన్, రైతా, చట్నీలు.. ఇలా ఎన్నో రకాల వెరైటీలు టేబుల్‌పై ఉన్నాయి. చూడగానే కడుపు నిండిపోయినట్టు అనిపించే స్పెషల్ మీల్ ఇమాన్వీ కెరీర్లో మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఫౌజీ 2027కు వాయిదా పడింది. విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
Read Also :
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

