Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
Rahul Gandhi : సర్‌కు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేష్ కుమర్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వరుసగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Rahul Gandhi : సర్‌కు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేష్ కుమర్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వరుసగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కి దేశంలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, సంఘాలు కీలక విజ్ఞప్తి చేశాయి. ఈ ఆందోళనల వల్ల తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని, అందువల్ల ఆందోళనలు ఆపాలని కోరాయి.
వ్యాపార, వాణిజ్య వేత్తలు, కార్మికుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాయి. ఇది అసలే పండుగల సీజన్ అని, ఇలాంటి సమయంలో తమ కార్యకలాపాలు దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్ 12, 13 తేదీల్లో.. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, కేరళలకు చెందిన ట్రేడ్ అసోసియేషన్లు తమ ఆందోళన వ్యక్తం చేశాయి. వ్యాపారులు వెల్లడించిన కీలక వివరాలివి. ఇది నవరాత్రి, దసరా, దీపావళి, ఛాట్ పూజ వంటి ఆధ్యాత్మిక వేడుకలు జరిగే సమయం. ఇలాంటి సందర్భాల్లో నిరసనల వల్ల అనేక ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి.
రోడ్లు బ్లాక్ చేయడం, వాణిజ్య సంస్థలు మూసివేయడం వంటి వాటి వల్ల సంప్రదాయ వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ అంశంలో రాహుల్ గాంధీకి కీలక సూచనలు చేశాయి. నిరసనల కోసం ప్రత్యేక సమయం, పద్ధతి అవలంభించాలంటూ సూచించాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని కోరాయి. నిరసనలు తెలియజేసే ప్రజాస్వామిక హక్కును కొనసాగిస్తూనే.. ఇతర చట్టబద్ధమైన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని, అలాగే, వాటిపై ఆధారపడ్డ కూలీలు, కార్మికులు వంటి వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాయి.
నిరసనల వల్ల మార్కెట్లో అనిశ్చిత కొనసాగుతోందని ట్రేడర్స్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ పునరాలోచించాలని ద ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) కోరింది. తమకు ఈ పండుగల సమయంలో ఎంతో కీలకమని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

