వయస్సు సడలింపు జీవోను సవరించాలి
ఉద్యోగ నియామకాల్లో ఏజ్ రిలాక్సేషన్(వయస్సు సడలింపు)జీవోను ప్రభుత్వం తక్షణమే సవరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు పాలకూరి అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్లు లేవని పేర్కొన్నారు.
- లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
- ప్రభుత్వానికి నిరుద్యోగుల హెచ్చరిక
ఖైరతాబాద్, ఏప్రిల్ 29 : ఉద్యోగ నియామకాల్లో ఏజ్ రిలాక్సేషన్(వయస్సు సడలింపు)జీవోను ప్రభుత్వం తక్షణమే సవరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు పాలకూరి అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్లు లేవని పేర్కొన్నారు.
నాలుగు రోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందని, అందులో వ యోపరిమితి 34 అని పేర్కొన్నారని, ఫలితంగా ఏజ్ రిలాక్సేషన్‌లో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో42 ద్వారా పదేండ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ వయోపరిమితిని 34 నుంచి44 ఏండ్ల కు పెంచిందని, దానికి ఇంకా సమయం ఉండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాత గొప్పల కోసం హడావుడిగా జీవో-30ని జారీ చేసి వయోపరిమితి 46 ఏండ్లకు పెంచిందని, అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఆ జీవో కాలపరిమితి ముగిసిందని, మూడు నెలలవుతున్నా ఇప్పటికీ దానిని సవరించలేదని పేర్కొన్నారు.
ఈలోగా పీసీబీలో నోటిఫికేషన్ వచ్చిందని, అందులో వయోపరిమితి కేవలం 34 ఏండ్లు ఇవ్వడంతో అనేక మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందని వాపోయారు. అసెంబ్లీ సాక్షిగా 67,968 ఉద్యోగాలు ఇచ్చామని, అందులో 50వేలు గత ప్రభుత్వం ఇచ్చిన వా టికి పత్రాలు ఇచ్చామని, తాజాగా 17వేలు ఇచ్చామంటూ చెప్పిన ముఖ్యమంత్రి, బయ ట సమావేశంలో మాత్రం లక్ష ఉద్యోగాలు ఇ చ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఏజ్ రిలాక్సేషన్ పెంచి నోటిఫికేషన్ వి డుదల చేయకపోతే లక్ష మంది నిరుద్యోగులతో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామ ని హెచ్చరించారు. సమావేశంలో సింధురెడ్డి, రంజిత్‌ప్రసాద్, లక్ష్మీకాంత్, కృష్ణసోమేశ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులతోనే అధికారంలోకి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే చివరిక్షణం వరకు నిరుద్యోగుల కోసం మొసలి కన్నీరు కార్చారని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నేత రవీందర్‌నాయక్ విమర్శించారు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన అద్దంకి దయాకర్, మానవతారాయ్, కోదండరాం, బల్మూరి వెంకట్ ఇప్పుడు పదవులను ఎంజాయ్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. రెండు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పి భర్తీ చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. జీవో-30 గడువు తీరిపోయినా ప్రభుత్వానికి సోయిలేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఓట్ల తో అధికారంలోకి వచ్చి వారినే మోసగిస్తా రా? అని నిలదీశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జీవో ను సవరించడం లేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

