ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు, అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ ధ్వజమెత్తారు. బుధవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు.
నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.