మహబూబ్నగర్, జూన్ 16 : జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు తప్ప కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ల జారీ కోసం ఈ నెల 20న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు.