కాజీపేట, ఏప్రిల్ 4: ఉద్యోగం రాకపోవడంతో మానసికంగా కృంగిపోయిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. కాజీపేట సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేటలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన చెలుకపల్లి అభినవ్ (29) నాలుగేండ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం లభించకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నా డు. కొంతకాలంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్న అభిన వ్ శనివారం ఇంట్లో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చెలుకపల్లి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య ; నిండా ముంచిన పత్తి..భారంగా అప్పులుసిద్దిపేట జిల్లాలో విషాదం
గజ్వేల్, ఏప్రిల్ 4: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మణ్ (29) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో 14 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి సాగు చేశాడు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలతో పత్తి పంటలో తీవ్ర నష్టం వచ్చింది. పెట్టుబడులు కూడా రాలేదు.పంటల సాగు కోసం సుమారు రూ.12 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చేమార్గం లేక తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లిన లక్ష్మణ్ రాత్రి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పొలం వద్ద వెతుకగా చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ విగత జీవిగా కన్పించాడు.