గంజాయి మత్తులో బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ మేనమామ, సోదరులు
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ బాలికపై మేనమామ, వరసకు సోదరులు అయ్యే ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ బాలికపై మేనమామ, వరసకు సోదరులు అయ్యే ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
మహారాష్ట్రకు చెందిన బాలిక (13) తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట మరణించడంతో కీసరలోని అమ్మమ్మ ఇంట్లో ఉంది. స్థానికుల సహాయంతో తుర్కపల్లిలోని వసతీగృహంలో చేరింది. ఇటీవల సెలవులు కావడంతో కీసరలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మేనమామతో పాటు వరసకు సోదరులైన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత బాలిక మళ్లీ వసతీగృహానికి వెళ్లిపోయింది. అక్కడ ఫ్యాన్ తగిలి గాయాలు కావడంతో చికిత్స అనంతరం ఇటీవల మళ్లీ అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో లైంగిక దాడికి సంబంధించిన విషయం బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Ganja
- Hyderabad
- Medchal
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

