జైపూర్/చెన్నూర్ రూరల్, ఆగస్టు 30 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామస్థులు జైకొట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను గెలిపిస్తామని ప్రకటించారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమై ఆ మేరకు తీర్మానించారు.
కాగా చెన్నూర్ మండలం లంబాడీపల్లికి చెందిన ఆసరా పింఛన్‌దారులు బాల్క సుమన్‌కు బాసటగా నిలిచారు. తమ ఓటు బాల్క సుమన్కేనంటూ ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.