సంస్థాన్‌నారాయణపురం, డిసెంబర్ 6 : తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సంస్థాన్‌నారాయణపురం మండ లం సర్వేల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములు గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటుండగా, చిన్న కుమారుడు శ్రీశైలం(40) గ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడుపుతూ తల్లిదండ్రుల బా గోగులు చూసుకుంటున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం, తండ్రి చనిపోవడంతో మనోవేదనకు గురై న శ్రీశైలం తండ్రి అంత్యక్రియలు ముగిసిన అనంత రం గ్రామంలోని వ్యయసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించి, అంత్యక్రియ లు నిర్వహించారు. శ్రీశైలానికి పెండ్లి కాలేదు. త్రండీకొడుకులు ఒకే రోజు మృతిచెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.