హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యూజీసీ ముసాయిదా నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిందేనని మాజీ మంత్రి, ఓబీసీ సంఘం కన్వీనర్ వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డీఎంకే స్టూడెంట్స్ వింగ్ నేతృత్వంలో జరిగిన యూజీసీ ముసాయిదా నిబంధనల వ్యతిరేక ఉద్యమానికి అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐవోబీసీఎస్‌ఏ) జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌తో కలిసి గురువారం శ్రీనివాస్‌గౌడ్ మద్దతు తెలిపి మాట్లాడుతూ.. యూజీసీ ముసాయిదా నిబంధనలు విద్యను వ్యాపారం చేసేలా, హకులను బలహీనపరిచేలా ఉన్నాయని విమర్శించారు.