Government school | ఒకటో తరగతిలో 70% ప్రైవేట్‌కే.. సర్కార్ బడుల్లో చదువుతున్నది 28శాతమే
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదివే విద్యార్థుల్లో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం 28 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 70.43 శాతం మంది ప్రైవేట్ బడులకు వెళ్తున్నారు.
- తాజాగా యూడైస్ ప్లస్ 2025-26 నివేదిక వెల్లడి
- రానురాను పూర్తిగా ఖాళీ అవుతున్న ప్రభుత్వ బడులు
- రాష్ట్రంలో 4,793 సింగిల్ టీచర్ పాఠశాలలు
- విద్యుత్తు కనెక్షన్లు లేని సర్కార్ బడులు 180
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదివే విద్యార్థుల్లో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం 28 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 70.43 శాతం మంది ప్రైవేట్ బడులకు వెళ్తున్నారు. రానురాను ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ మరింత తగ్గే ప్రమాదం పొంచి ఉన్నది.
ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆన్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 నివేదిక తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 6,39,730 మంది విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందారు. వీరిలో కేవలం1,83,974 (28 శాతం) మంది మాత్రమే సర్కార్ బడుల్లో ఒకటో తరగతిలో చేరారు. ఎయిడెడ్ బడుల్లో 4,997(0.78శాతం) మంది మాత్రమే ఉన్నారు.
అదే ప్రైవేట్ స్కూళ్లల్లో ఏకంగా 4,50,578 (70.43శాతం) మంది చేరారు. కేంద్రం వెల్లడించిన ఈ గణాంకాలు ప్రభుత్వ విద్యపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అమ్మాయిలు, అమ్మాయిల చదువులపై ఇంకా వివక్ష కనిపిస్తున్నది. అబ్బాయిలను ప్రైవేట్‌కు, అమ్మాయిలను సర్కార్ బడులకు పంపిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. సర్కార్ బడుల్లో అబ్బాయిలతో పోల్చితే లక్ష మంది అమ్మాయిలు ఎక్కువగా చదువుతుంటే, ప్రైవేట్‌లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు నాలుగు లక్షల మంది ఎక్కువగా చదువుతుండటం గమనార్హం.
మరికొన్ని గణాంకాలు ఇలా..
- రాష్ట్రంలో విద్యార్థుల మొత్తం నమోదు 74,57,851 నుంచి 76,76,413కు పెరిగింది. ఇంటర్ విద్యార్థుల వివరాలను యూడైస్‌లో నమోదు చేయడంతో ఈ సంఖ్య పెరిగినట్టు సమాచారం.
- టీచర్ల సంఖ్య 3,57,911 నుంచి 3,70,756కు పెరిగింది. ఒక్కో స్కూళ్లో సగటున 184 మంది విద్యార్థులున్నారు. నిరుడు ఒక బడిలో సగటు విద్యార్థుల సంఖ్య 173 మాత్రమే ఉన్నారు.
- రాష్ట్రంలో 74,743 మంది వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు అబ్బాయిలే. 42వేల మంది అబ్బాయిలుంటే, అమ్మాయిలు 32వేలు మంది ఉన్నారు.
- స్కూళ్ల సంఖ్య తగ్గుతున్నది. ఏడాదిలో రెండు వేల స్కూళ్లు తగ్గాయి. 2024-25లో 43,154 ఉండగా, 2025-26లో బడుల సంఖ్య 41,762కు పడిపోయాయి.
- కంప్యూటర్లు లేని స్కూళ్లు ఇంకా ఉన్నాయి. మొత్తం బడుల్లో 43శాతం స్కూళ్లల్లోనే కంప్యూటర్లున్నాయి. సర్కార్ బడుల్లో 24.8శాతం మాత్రమే కంప్యూటర్లు, ల్యాబ్‌లు ఉన్నాయి.
- రాష్ట్రంలో 4,793 సింగిల్ టీచర్ స్కూళ్లున్నాయి. 2024-25లో వీటి సంఖ్య 5,001 ఉండగా, ఈ సారి ఈ బడుల సంఖ్య తగ్గింది.
- సెకండరీ విద్యలో డ్రాపౌట్ రేట్ 1.7 శాతంగా ఉన్నది. అత్యధికంగా బాలురు 2.7 శాతం, బాలికలు 0.7 శాతం మంది 10వ తరగతి పూర్తిచేయకుండానే చదువులకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ప్రాథమికోన్నతలో 1.3శాతం విద్యార్థులు చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు.
- రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 11శాతంగా ఉన్నది. అప్పర్ ప్రైమరీలో 10, సెకండరీలో 11, హయ్యర్ సెకండరీలో14 శాతంగా ఉన్నది.
- రాష్ట్రంలో 55.1శాతం బడుల్లోనే కిచెన్ గార్డెన్లు ఉన్నాయి. 180 సర్కార్ బడులకు విద్యుత్తు కనెక్షన్లు లేవు. 260 బడుల్లో విద్యుత్తు కనెక్షన్లు ఉన్నా వినియోగించుకునేలా లేవు.
- బాలురు, బాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఉన్న బడులు 95 శాతం మాత్రమే. అంటే 5శాతం బడుల్లో టాయిలెట్ల కొరత వేదిస్తున్నది.
- సోలార్ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న బడులు కేవలం 7.1శాతం మాత్రమే. అంటే 92.9శాతం బడుల్లో సోలార్ విద్యుత్తు కనెక్షన్లు లేవు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

