హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా నిలుస్తున్నదని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. పికెట్, పరిగి డిపోలకు చెందిన డ్రైవర్లు సుధాకర్, శ్రీనివాసరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారికి కుటుంబ సభ్యులకు మంగళవారం రూ.కోటి చొప్పున చెకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, రీజినల్ హెడ్ వెంకటేశ్వర్లుతో కలిసి నాగిరెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు అకరకొచ్చిట్టు తెలిపారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈడీ సీహెచ్.వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప , సీపీఎం ఉషాదేవి, యూబీఐ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్టీసీ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘ఆర్ట్ ఫర్ లైఫ్’ పేరుతో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ఎండీ నాగిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.