హిమాయత్‌నగర్, జూన్ 23 : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్, కంప్యూటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ బాలిగ, ప్రధాన కార్యదర్శి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆయ న మాట్లాడుతూ.. టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వృత్తి నైపుణ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లలో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను ఇక్కడ కూడా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి వివేక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యవతి, నాయకులు విజయ్, రాధ, హరిప్రసాద్, అశోక్ పాల్గొన్నారు.