మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ చెక్‌పోస్టు (Jaipur check post)వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్ఫోస్ట్ సమీపంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.