యాచారం, సెప్టెంబర్ 7 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 15 ఏండ్ల బాలికను నందివనపర్తికి చెందిన గడల క్రాంతికుమార్, బాషమోని క్రాంతికుమార్ శనివారం రాత్రి వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఉన్న బాలికను ‘మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగింది’ అని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని నందివనపర్తి నుంచి తాటిపర్తికి వెళ్లే దారిలో ఓ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాలిక తనవద్ద ఉన్న మొబైల్ ఫోన్‌తో 100 నంబర్‌కు కాల్ చేయగా సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్ఐ మధు చేరుకుని బాధితురాలిని చికిత్స కోసం వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.