భువనగిరి కలెక్టరేట్/ మామిళ్లగూడెం /హైదరాబాద్ సిటీబ్యూరో/మన్సూరా బాద్, అక్టోబర్ 20: లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. యాదాద్రి జిల్లా భువన గిరి మండలం అనాజీపురంలో ఎరువు లు, విత్తనాల దుకాణం ఏర్పాటు కోసం వేముల విజయ్, రాజు వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డిని ఆశ్రయిం చారు. రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేయగా, మొదటి విడతగా రూ.లక్ష నగదు తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డాడు. ఖమ్మం జిల్లా ట్రాన్స్‌కో కార్యా లయ పరిధిలో గతేడాది సురేశ్‌బాబు అనే కాంట్రాక్టర్ పలు పనులు చేశారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసిన రూ.96 వేలు తిరిగి ఇవ్వాలని ఏడీఈ గుగులోత్ ఈర్యా, ఏఈ రనిల్ను సంప్ర దించగా డబ్బులు డిమాండ్ చేశారు. గురువారం వారు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి సబ్‌రిజిస్ట్రార్ సీహెచ్ పళని కుమారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశా రు. సోదాలు నిర్వహించి రూ.4.10 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు.