హైదరాబాద్/సుల్తాన్‌బజార్, జూలై 9(నమస్తేతెలంగాణ): సహకార బ్యాంకు రంగంలో రెండంచెల విధానమే మేలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంలో కొత్తగా 33 జిల్లాల్లో సహకార బ్యాంకు డైరెక్టర్లు ఎంపికవుతారని తెలిపా రు. ఆదివారం హైదరాబాద్ కోఠిలోని ఓ హోటల్లో తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉ ద్యోగుల సమాఖ్య ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వినోద్ మా ట్లాడుతూ.. ప్ర స్తుతం రాష్ట్రం లో త్రీ టైర్ విధా నం అమలులో ఉన్నదని, దీనివల్ల పరిపాలన, నిర్వహణ పరం గా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఏఐబీఈఏ జాతీయ అధ్యక్షుడు బీఎస్ రాంబాబు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రం గంలో మూడంచెల విధానాన్ని తొలగించేందుకు ఆర్బీఐ కూడా సానుకూలంగా ఉన్నదని అన్నారు.