అమెరికాలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
హుజూరాబాద్‌టౌన్/స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 21: అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన డాక్టర్ నవీన్, స్వాతి దంపతుల పెద్ద కుమారుడైన ముక నివేశ్ (20), జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లికి చెందిన కమల్‌కుమార్ గుప్తా, పద్మ దంపతుల కుమారుడైన గౌతంకుమార్(20) అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ (సీఎస్) సెకండియర్ చ దువుతున్నారు. శనివారం ఉదయం వీరిద్దరితోపాటు కళాశాలకు చెందిన మరో ఇద్దరు స్నేహితులు కలిసి వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా రాత్రి 11.30 గంటల (అమెరికా కాలమానం ప్రకారం)కు వెనుక నుంచి వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చొన్న నివేశ్, గౌతంకుమార్ మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్ నివేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

