సుల్తానాబాద్, ఏప్రిల్ 23: సిక్ లీవ్‌లు ధ్రువీకరించేందుకు సహోద్యోగి నుంచే రూ.20 వేల లంచం తీసుకుంటుండగా బుధవారం ఇద్దరు ఉన్నతోద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇజాజ్ గతేడాది సిక్ లీవ్ తీసుకున్నారు.
సిక్ లీవ్స్‌ను ధ్రువీకరించేందుకు ఎస్సారెస్పీ డివిజన్-6 సూపరింటెండెంట్ శ్రీధర్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్ రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని ఏసీబీ కోర్టుకు తరలించారు.