హైదరాబాద్ : సూర్యాపేట (Suryapet)) జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. కోదాడ పట్టణంలో(Kodada town) కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమ యమ య్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కాగా, కోదాడ టౌన్ పరిధిలోని భారతి పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో ఆదివారం రెండు కార్లు కొట్టుకొని రాగా ఓ కారులో కోదాడవాసి నాగం రవి మృతి దేహం లభ్యమైంది.
మరో సంఘటన కోదాడ శ్రీమన్నారాయణ కాలనీలో వరద నీటిలో టీచర్ వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైంది. నిన్న రాత్రి బైకుపై ఇంటికి వెళ్తూ వరదలో గల్లంతయిన వెంకటేశ్వర్లు శవంగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.