Kidney Patients | కిడ్నీ రోగులకు శుభవార్త.. కొత్తగూడెం జిల్లాలో మరో మూడు డయాలసిస్ సెంటర్లు
Kidney Patients | కిడ్నీ రోగుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో మరో మూడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణుగూరులోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, ఇల్లందులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం నాడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించనున్నారు.
Kidney Patients | హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిడ్నీ రోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాలకు కిడ్నీ రోగులు పోటెత్తడం, అధిక సమయం వేచి ఉండాల్సి ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో మరో మూడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణుగూరులోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, ఇల్లందులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం నాడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించనున్నారు. అశ్వరావుపేటలో మూడో డయాలసిస్ సెంటర్‌ను ఈ నెలాఖరు వరకు ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐదు మెషీన్లతో, భద్రాచలం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో 10 మెషీన్లతో డయాలసిస్ సెంటర్లను కొనసాగిస్తున్నారు. అయితే ఈ సెంటర్లు కిడ్నీ రోగులకు సరిపోవడం లేదు. కిడ్నీ రోగుల తాకిడి ఎక్కువైనందున మణుగూరు, ఇల్లందు, అశ్వరావుపేటలో కొత్తగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

