పెద్దపల్లి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 800 ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఇకపై నాలుగు సాధారణ బోగీలతో నడవనున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లలో కేవలం రెండు సాధారణ బోగీలే ఉన్నాయి. ఇప్పటికే కొన్నింటికి రెండు బోగీల బిగింపు పూర్తి కాగా, డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తం 800 రైళ్లల్లో అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రయాణికుల వినతులను పరిశీలించిన కేంద్ర రైల్వేశాఖ, రైల్వే బోర్డు అధికారులు దేశవ్యాప్తంగా నడిచే దూరప్రాంతాల రైళ్లన్నింటికీ అదనంగా మరో రెండు బోగీలు జోడించి మొత్తంగా నాలుగు సాధారణ బోగీలతో రైళ్లను నడిపించనున్నారు.