హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ కి చెందిన మరో ఇద్దరు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టు తెలుస్తున్నది. మావోయి స్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజ న్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబ య్య అలియాస్ ఆజాద్‌తోపాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ లొంగిపోనున్నట్టు సమాచారం. వీరితో దాదాపు 90% అగ్రనాయకత్వం జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టేనని భావిస్తున్నారు.
పోలీస్‌స్టేషన్ నుంచి ఖైదీ పరార్ ; నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘటన
కల్వకుర్తి రూరల్, నవంబర్ 14 : విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకొచ్చిన ఖైదీ పరారైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ది. కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తిలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నాగిరెడ్డి అనే ఖైదీని ఏపీలోని అనంతపురం జైలు నుంచి ఈ నెల 11న కల్వకుర్తికి తీసుకొచ్చారు. గురువారం అర్ధరాత్రి బాత్రూం వస్తుందని తెలిపాడు. పోలీస్‌స్టేషన్ ఆవరణ లో ఉన్న బాత్రూమ్కు వెళ్లాలని సూచించగా, బయటకు వచ్చిన నాగిరెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు.