హైదరాబాద్, మే 31/ నాంపల్లి కోర్టులు (నమస్తే తెలంగాణ) : గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ అధికారులు శుక్రవారం అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌కుమార్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సబావత్ రాంచందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ గొర్రెల పంపిణీ నిబంధనలు ఉల్లఘించి వీరిని జ్యుడీషియల్ రిమాండ్ కోసం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా 14 రోజల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. వీరిని చంచల్గూడా జైలుకు తరలించారు. ఈ కేసులో 8 మంది నిందితులు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కుంభకోణంలో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.