Karimnagar Accident | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ – పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద ఆగివున్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో కారు ఒకవైపు భాగం మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు..
మృతులను సయ్యద్ అబ్దుల్ రెహమాన్ (19), సయ్యద్ అతియాబ్ హుస్సేన్ (21)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఎండీ అదునాన్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇక ఎండీ అబ్రార్ కారులో నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.