హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని(Shadnagar) జాతీయ రహదారిపై ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను(Van) అదుపు తప్పి చెట్టును(Tree) ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందగా మరో నలుగురిక తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.