ఆదిలాబాద్: జిల్లాలోని బేల మండలంలో పులిచర్మం (Tiger Skin) పట్టుబడింది. మండలంలోని సైదాపూర్‌లో పోలీసులు, అటవీ శాక అధికారులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైదాపూర్ సమీపంలో పులిచర్మం పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులిని ఎక్కడ చంపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 50 రోజుల్లో వ్యవధిలోనే జిల్లాలో రెండు పులి చర్మాలు పట్టుబడటం విశేషం. అక్టోబర్ 30న ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలో పులి చర్మాన్ని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.