హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఓ బిల్లు విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు జీఎస్టీ అధికారులను మంగళవారం సీబీఐ అధికారులు రెడ్హ్యాడెండ్గా పట్టుకున్నారు. హైదరాబాద్లోని జీఎస్టీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు ప్యారిటీ బిల్లు చెల్లింపునకు సంబంధించి అదే విభాగంలో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి రూ. 30వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు అంత ఇచ్చుకోలేనని చెప్పగా, రూ. 25వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో సీఐబీ అధికారుల సూచన మేరకు.. బాధితుడు నిందితులకు డబ్బులు ఇస్తుండగా, అధికారులు రెడ్హ్యాడెండ్గా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం వారికి సంబంధించిన పలు చోట్ల అధికారులు సోదాలు చేపట్టారు.