గుండాల, ఏప్రిల్ 30 : లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నడిమిగూడెం బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బానోత్ నరేశ్.. సాయనపల్లి బీట్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యలు నిర్వర్తిస్తున్నాడు. సాయనపల్లికి చెందిన ఓ రైతు ఆరు ఎకరాల్లో పోడు వ్యవసా యం చేస్తుండగా.. అందులో మూడు ఎకరాలకు పట్టాలేదు. దీంతో ఆ భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మూడెకరాల పట్టా కూడా రద్దు కాకుండా ఉండాలంటే తనకు రూ.15 వేలు లంచం ఇవ్వాలని బీట్ ఆఫీసర్ నరేశ్ సదరు రైతును బెదిరించాడు. బాధిత రైతు రూ.10 వేలను గుండాలలోని కార్యాలయంలో బీట్ ఆఫీసర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అతడిపై కేసు నమోదు చేసి, వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ వివరించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయం లో బిల్ కలెక్టర్‌గా పని చేస్తున్న నిఖిల్‌రెడ్డి వద్దకు ఓ బాధితుడు ఇటీవల వచ్చి తన ఇంటి పన్ను గతంలో రూ.41వేలు ఉండేదని, ప్రస్తుతం రూ. 1,0,400 వచ్చిందని తెలిపాడు. దీంతో రూ. 50వేలు ఇంటి పన్ను తగ్గిస్తానని రూ. 35వేలు లంచం ఇవ్వాలని నిఖిల్‌రెడ్డి డిమాండ్ చేశాడు. బాధితుడు రూ. 20వేలు మొదటి విడతగా అందజేశాడు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో బాధితుడి నుంచి మరో రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా నిఖిల్‌రెడ్డిని పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పేర్కొన్నారు.