పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
తరగతి గదిలో పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా చోటుచేసుకున్నది. శనివారం బోనకల్లు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో 9వ తరగతి ఏ, బీ సెక్షన్ల గదిలో 60 మంది విద్యార్థినులకు ఉపాధ్యాయురాలు సాంఘిక శాస్త్రం బోధిస్తున్నారు.
- బోనకల్లు గురుకుల పాఠశాలలో ఘటన
- డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే ఎలా అని తల్లిదండ్రుల ఆగ్రహం
బోనకల్లు, అక్టోబర్ 31 : తరగతి గదిలో పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా చోటుచేసుకున్నది. శనివారం బోనకల్లు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో 9వ తరగతి ఏ, బీ సెక్షన్ల గదిలో 60 మంది విద్యార్థినులకు ఉపాధ్యాయురాలు సాంఘిక శాస్త్రం బోధిస్తున్నారు. ఈ క్రమంలో రెండో అంతస్తు గది పైకప్పు నుంచి భారీ కాంక్రీట్ పెచ్చులు ఒకసారిగా ఊడి విద్యార్థినులపై పడ్డాయి.
చిరునోముల గ్రామానికి చెందిన చాలపమడుగు పూజిత తలకు, నాగిలిగొండకు చెందిన అద్దంకి కీర్తన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఇన్చార్జి ప్రిన్సిపాల్ షేక్ షీలా బేగం, ఉపాధ్యాయులు విద్యార్థినులను పీహెచ్‌సీకి తరలించారు. తహసీల్దార్ సుధాకర్ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల మరమ్మతుల కోసం గతంలో రూ.15 లక్షలు మంజూరైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేశారని ఇన్చార్జి ప్రిన్సిపాల్ తహసీల్దార్‌కు వివరించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతాచోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

