జడ్చర్ల, సెప్టెంబర్ 29 : విద్యుత్తు స్తంభాలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడగా.. ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ లో చోటుచేసుకున్నది. స్థానికుల కథ నం మేరకు.. జడ్చర్ల మండలం చిన్న ఆదిరాలకు చెందిన రైతులు బోరు బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసేందుకు జడ్చర్ల నుంచి ట్రాక్టర్లో స్తం భాలను తీసుకెళ్తున్నారు. గంగాపూర్ ప్రధాన రహదారిపై అదుపుతప్పి ట్రాక్ట ర్ ట్రాలీ బోల్తా పడగా.. ట్రాలీలో కూ ర్చున్న రైతులు పెరుమళ్ల జంగయ్య, ఎద్దుల జంగయ్యపై స్తంభాలు పడ్డా యి. దీంతో పెరుమళ్ల జంగయ్య (60) అక్కడికక్కడే మృతి చెందగా, ఎద్దుల జంగయ్య(40) మహబూబ్‌నగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ ఆదిరెడ్డి తెలిపారు.