సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం రాజీవ్ రహదారిపై లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. మృతులను సందీప్ (19), రాజు (25)గా గుర్తించారు. ఇద్దరు మిరుదొడ్డి గ్రామానికి చెందినవారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్లోని హయత్నగర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందారు. సోమవారం ఉదయం కుంట్లూరు రోడ్డులో మదర్ డెయిరీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.