హైదరాబాద్: సికింద్రాబాద్, షాబాద్‌లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గేటు వద్ద బైకును డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
మరో ఘటనలో సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో బైకును లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న మహిళ మరణించింది. మరో వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెన మహిళను లక్ష్మీ దుర్గగా గుర్తించారు. ఆమె గుజరాతి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నదని చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త గాయపడ్డాడని, అతడిని దవాఖానకు తరలించామని తెలిపారు. ఈ రెండు ఘటనపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.