బీబీనగర్ టోల్‌గోట్ వద్ద ప్రమాదం.. ఇద్దరు మృతి
Bibinagar | యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ( Bibinagar) టోల్‌ప్లాజా సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున పూల లోడుతో వెళ్తున్న ఆటో ట్రాలీ టోల్గేట్ సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఉద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ( Bibinagar) టోల్‌ప్లాజా సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున పూల లోడుతో వెళ్తున్న ఆటో ట్రాలీ టోల్గేట్ సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఉద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం ధాటికి ట్రాలీ ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను పర్వతగిరి మండలం తోటపల్లికి చెందిన అనిల్, వరంగల్‌కు చెందిన ఖలీల్‌గా గుర్తించారు.
కాగా, అదే సమయంలో పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనా స్థలంలో ఆగారు. దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన విషయాలను తెలుకున్నారు. మృతులకు సంబంధీకులతో మాట్లాడి విచారం వ్యక్తంచేశారు. రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. అతివేగం, నిద్రలేమి, అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ పాటించపోవడం వంటి అనేకానేక కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ఈ అంశాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

