నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 5: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీవాడ సీ బ్లాక్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి చెందారు. నిర్మల్ పట్టణ సీఐ సమ్మయ్య తెలిపిన వివరా ల ప్రకారం.. కాల్వగడ్డ కాలనీలో నివా సం ఉంటున్న ఒడిసెల విజయ్ (50) అక్కడి నుంచి డబుల్ బెడ్రూమ్ కాలనీలోకి మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంట్లో సామాన్లు సర్దేందుకు ఓ మహిళా కూలీని శనివారం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్రిడ్జి పేలి కూలర్ ద్వారా ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు ఇల్లంతా వ్యాపించడంతో తీవ్రంగా కాలిపోయిన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మృతి చెందారు. విజయ్‌కి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతి చెందిన మహిళ వివరాలు తెలియరాలేదు.