హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 35 టీచింగ్స్ దవాఖానల్లో రెండు చొప్పున డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు సనత్నగర్ టిమ్స్, టీవీవీపీ దవాఖానల్లో పది బెడ్లతో కూడిన డయాలసిస్ సెంటర్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వచ్చే పేషెంట్లతో ఇవి నిండిపోతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న అవసరాన్ని బట్టి మరో 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో ప్రతి 25 కిలో మీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు మ్యాపింగ్ చేశారు. వీటిని త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.