TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 26న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకొని వాయువ్య ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న మయన్మార్-దక్షిణ బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లోనున్న తమిళనాడును ఆనుకొని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ క్రమంలో సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మంగళశారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది.