TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడుతాయని పేర్కొంది. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. పలుచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.