హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు(Goods train) కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు(Commit suicide )పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో(Miryalaguda) ఇద్దరు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దుర్గానగర్ వాసులుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.