Tragedy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలపైకి కారు ఎక్కించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. నవ్యనగర్కు చెందిన మహేశ్వరి నర్రెడ్డిగూడెంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. స్థానిక మైదానంలో ఆమె డ్రైవింగ్ నేర్చుకుంటుండగా.. అక్కడే ఆడుకుంటున్న అక్కాతమ్ముళ్లపైకి కారును పోనిచ్చింది. ఈ ప్రమాదంలో పదేళ్ల మణివర్మ మృతి చెందాడు. ఏకవాణి(14) తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏకవాణి కూడా మృతిచెందింది.
కాగా, డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలను బలితీసుకున్న యువతిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.