హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రిపబ్లిక్ డే వేడుకల కోసం దేశవ్యాప్తం గా 17 ఎస్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపిక చేసిన 9 మంది అత్యుత్తమ క్యాడెట్లలో ఏపీ, టీఎస్ రీజియన్‌కు చెందిన ఇద్దరు క్యాడెట్లు ఎంపికైనట్టు డిఫెన్స్ విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తిరుపతి గ్రూప్ నుంచి జేడీ/జేడబ్ల్యూ ఆర్మీ విభాగంలో బెస్ట్ క్యాడెట్‌గా సార్జంట్ ఎం శ్రీశాంత్, సికింద్రాబాద్ గ్రూప్ నుంచి జేడీ/జేడబ్ల్యూ నేవీ విభాగంలో బెస్ట్ క్యాడెట్‌గా సీడీటీ నాగండ్ల ధీరజ్ ఎంపికయ్యా రు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఈ ఇద్దరు క్యాడెట్లను అధికారులు అభినందించారు. వీరిద్దరూ ఏపీ, టీఎస్ ఎస్సీసీ డైరెక్టరేట్‌కు ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చారని ఎస్సీసీ అధికారులు కొనియాడారు.