హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మల్క కొమురయ్యకు మరో రెండు సంఘాలు మద్దతుపలికాయి.
తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, టీయూటీఎఫ్ మద్దతు పలికాయి. కొమురయ్య గెలుపునకు కృషిచేస్తామని ఇరు సంఘాల నేతలు తెలిపారు.