కుమ్రం భీం ఆసిఫాబాద్ : బాలిక పై లైంగిక దాడి(Girl assault) చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష( Imprisonment) విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా(Kumram Bheem Asifabad) సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి గుండి గ్రామంలో మైనర్‌పై జరిగిన లైంగికదాడి ఘటనలో ఆసిఫాబాద్‌కు చెందిన వసంత్ (19)అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల విచారణ అనంతరం సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసి, ఫోక్సో కేసులో పోలీసులు సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ ప్రవేశపెట్టిన సాక్షుల విచారణ అనంతరం కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 420, 376(2)(3) ఐపీసీ, ఫోక్సో చట్టం కింద సెక్షన్ 4 కింద 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించారు.