హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): సాధారణ బదిలీల్లో అక్రమా లు, అర్హత లేకున్నా పోస్టింగులు వంటి ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్‌నాయక్, మరో ఏడుగురిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
మొత్తం వ్యవహారంలో విచారణకు గతంలో ఐఏఎస్ అధికారులు కర్ణన్, హైమావతిలను సర్కారు నియమించింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా డీహెచ్‌తో పాటు ఏడుగురికి షోకాజ్ నోటీసులతో పాటు మెమోలు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో మరోసా రి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకు ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.