చెన్నై, జూలై 18:ద్వి, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్‌సైకిల్ 2025 అపాచీ ఆర్టీఆర్ 310 సీసీని అప్‌గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేసింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2,39,990గా నిర్ణయించిన సంస్థ..టాప్ వేరియంట్ మాడల్ రూ.2.57 లక్షలు. నూతన ఫీచర్స్‌తో తయారు చేసిన ఈ బైకులో ఓబీడీ2బీ -కాంప్లియెంట్, యూఎస్డీ 43 డియా ఫ్రంట్ సస్పెన్షన్, ట్రాన్సపరెంట్ క్లచ్ కవర్, డ్రగ్ టార్చ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నట్టు టీవీఎస్ మోటర్ హెడ్ విమల్ సుంబ్లీ తెలిపారు.