కాశీబుగ్గ (వరంగల్), జూన్ 19 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఈ-నామ్ ద్వారా పసుపునకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
విషయం తెలిసిన వెంటనే మార్కెట్ కమిటీ అధికారులతోపాటు అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎన్రెడ్డి లింగారెడ్డి, ఎనుమాముల ఎస్సై మిరిపెల్లి రాజు పసుపుయార్డుకు వచ్చి రైతులతో మాట్లాడారు.