నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పసుపు రైతులు ఆందోళన చేస్తున్నారు. క్వింటా పసుపుకు కనీస మద్దతు ధర లభించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ మార్కెట్ చైర్మన్‌ను ముట్టడించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో కుర్చీలు పగలగొట్టారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్ యార్డ్ చేరుకొని రైతులను అడ్డుకున్నారు. వ్యాపారులు, మార్కెట్ యార్డ్ అధికారులు కుమ్మక్కై పసుపు రైతులను తీవ్ర నష్టాలకు గురి చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
