అయిజ, డిసెంబర్ 6 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల బిగింపు పనులను టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ్ నాయక్ శనివారం ప్రారంభించారు. డ్యాంలో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండి, క్రస్ట్‌గేట్లకు సగానికి తాకుతుండటంతో గేట్ల పైభాగాలను కత్తిరిస్తున్నారు.
43 టీఎంసీలకు చేరుకునేలోగా సగం పనులు పూర్తి చేయనున్నట్టు డ్యాం సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు. నిరుడు ఆగస్టులో తుంగభద్ర నదికి వచ్చిన భారీ వరదకు డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో అదే స్థానంలో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటును బిగించారు.