అయిజ, ఏప్రిల్ 25 : తుంగభద్ర జలాశయం 33 కొత్త క్రస్ట్‌గేట్ల బిగింపు పూర్తయిందని టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు. రూ.51కోట్ల వ్యయంతో నిరుడు డిసెంబర్లో టీబీ డ్యాం గేట్ల బిగింపు పనులు మొదలు పెట్టారు. బోర్డు చైర్మన్ ఎస్ఎస్ పాండే, కార్యదర్శి రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో టీబీ బోర్డు ఇంజినీర్లు పనులు పూర్తి చే శారు. శనివారం 33 క్రస్ట్‌గేట్లు బిగించి, ట్రయల్ రన్ పూర్తి చేశారు. ప్రస్తుతం బిగించిన క్రస్ట్‌గేట్లు 70 ఏండ్ల వరకు పనిచేస్తాయని వెల్లడించారు. గేట్ల బిగింపు పూర్తి కావడంతో వానకాలంలో టీబీ డ్యాం నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు సాగు, తాగునీటిని విడుదల చేస్తామని చెప్పారు.