హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యా యవాది తులసీరాజ్ గోకుల్ తెలంగాణ లెజిస్లేచర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. శనివారం బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్‌కు చెందిన తులసీరాజ్ గోకుల్ నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్, పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 30 ఏండ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న తులసీరాజ్ గోకుల్‌కు విశేష అనుభవం ఉన్నది.